మళ్ళీ బాలీవుడ్ సినిమా చేస్తాడా ?

Tuesday,January 19,2021 - 06:30 by Z_CLU

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ నెక్స్ట్ ఓ బాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. లాక్ డౌన్ ను కంప్లీట్ గా ముంబైలోనే గడిపిన పూరి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. గ్యాప్ దొరికినప్పుడు రెండు మూడు రోజులు మాత్రమే హైదరాబాద్ లో అడుగుపెడుతున్నాడు.  దీంతో పూరి త్వరలోనే ఓ హిందీ సినిమా చేస్తున్నాడని , అందుకే ముంబై కి షిఫ్ట్ అయ్యాడని ప్రచారం మొదలైంది.

గతంలో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా’ అనే సినిమా తీసాడు పూరి. ఆ సినిమా కమర్షియల్  గా హిట్ అనిపించుకుంది. కానీ తర్వాత మళ్ళీ బాలీవుడ్ వైపు చూడలేదు. ఇప్పుడు విజయ్ తో చేస్తున్న సినిమాతో మళ్ళీ బాలీవుడ్ కి వెళ్తున్నాడు. ‘లైగర్’  తెలుగు , తమిళ్, మలయాళం భాషలతో పాటు హిందీలో కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత పూరి హిందీ సినిమా చేస్తాడని టాక్. పూరి తెలుగులో బాలయ్య , నాగార్జున తో సినిమాలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వాళ్ళిద్దరూ చెరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఈ గ్యాప్ లో పూరి బాలీవుడ్ లో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.

విజయ్ తో పూరి ‘లైగర్’