మోక్షజ్ఞ సినిమాకి స్టార్ డైరెక్టర్ ఫిక్స్ ?

Sunday,September 24,2017 - 03:06 by Z_CLU

2018 జూన్ లో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ అంటూ ఇటివలే అనౌన్స్ చేశాడు బాలకృష్ణ . దీంతో మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ లో ఒక్కసారిగా వైబ్రేషన్స్ బిగిన్ అయిపోయాయి. అయితే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే సినిమాకు దర్శాకుదేవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవ్తుంది.

ప్రస్తుతం జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న బాలయ్య మరో వైపు మోక్షజ్ఞ సినిమాపై కూడా దృష్టి పెట్టాడని, తనయుడి కోసం ఇప్పటికే స్టార్ దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. మొన్నటి వరకూ మోక్షజ్ఞ సినిమాకి దర్శకుడిగా క్రిష్ పేరు వినిపించగా లేటెస్ట్ గా పూరి పేరు తెరపైకి వచ్చింది. రీసెంట్ గా పూరి దర్శకత్వంలో ‘పైసా వసూల్’ సినిమా చేసిన బాలయ్య పూరి మేకింగ్ స్టైల్ కి ఫిదా అయి మోక్షజ్ఞ ఎంట్రీ భాద్యత ను పూరి కే అప్పగించాడనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.