రేపు గ్రాండ్ గా రిలీజవుతున్న మెహబూబా

Thursday,May 10,2018 - 04:18 by Z_CLU

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మెహబూబా’. 1971 ఇండో పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో పూరి ఆకాష్ కమర్షియల్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. భారీ అంచనాల మధ్య రేపు వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది ఈ సినిమా.

పూరి జగన్నాథ్ రెగ్యులర్ సెటైరికల్ స్టైల్ లో కాకుండా కంప్లీట్ ఇమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేస్తుంది. దానికి తోడు ఫిల్మ్ మేకర్స్ అగ్రెసివ్ గా చేస్తున్న ప్రమోషన్స్, యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్ చూస్తుంటే, సినిమా సక్సెస్ గ్యారంటీ అనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నాడు.