సెట్స్ పైకి వచ్చేసిన పూరి జగన్నాథ్ మెహబూబా

Wednesday,October 11,2017 - 01:15 by Z_CLU

పూరి ఆకాష్ హీరోగా నటించనున్న ‘మెహబూబా’ ఈ రోజు సెట్స్ పైకి వచ్చేసింది. 1971 లో జరిగిన ఇండో పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ రోజే హిమాచల్ ప్రదేశ్ లో బిగిన్ అయింది. ‘పైసా వసూల్’ తరవాత పూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో బాలయ్య, ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకుని మరీ ఈ సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేయడం విశేషం.

అల్టిమేట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో పూరి ఆకాష్ ను మాస్ హీరోగా సరికొత్తగా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు పూరి. ఈ షెడ్యూల్ తరవాత పంజాబ్, రాజస్థాన్ లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ డిజైన్ చేసుకున్న సినిమా యూనిట్, పూరి స్టైల్ లో ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. ఈ సినిమాకి సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజర్.