‘మెహబూబా’ ఫస్ట్ లుక్ టీజర్

Friday,February 09,2018 - 12:13 by Z_CLU

మాసివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ‘మెహబూబా’ సినిమా. పూరి తనయుడు ఆకాష్, నేహాశెట్టి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైంది. ఇండో–పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తోంది ‘మెహబూబా’.

ఆకాష్ ను పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ప్రజెంట్ చేసే ఉద్దేశంతో హై ఎమోషన్స్ తో ఉన్న మెహబూబా సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నాడు పూరి జగన్నాధ్. సినిమాలో ఆకాష్, నేహా ఎలా కనిపించబోతున్నారనే విషయాన్ని టీజర్ లో చూపించాడు. అంతేకాదు.. సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విష్ణు సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

పూరి ఆకాష్ సైనికుడిలా నటిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి ముస్లిం అమ్మాయిలా కనిపిస్తోంది. ఇండో పాక్ వార్ తో పాటు ఇంటెన్సివ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. సమ్మర్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.