పూరి జగన్నాథ్ 'మెహబూబా' ట్రైలర్ రివ్యూ

Monday,April 09,2018 - 07:12 by Z_CLU

ఇండియా, పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది పూరి జగన్నాథ్ ‘మెహబూబా’. పూరి ఆకాష్ ని కమర్షియల్ హీరోగా ప్రెజెంట్ చేయనున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే రిలీజయింది. వార్ సీక్వెన్సెస్ తో పాటు ఇమోషనల్ లవ్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేస్తున్న ఈ ట్రైలర్ సినిమా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తుంది.

అల్టిమేట్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ రియల్ స్టామినా ఎలివేట్ అవుతుంది. 2 నిమిషాల 6 సెకన్ల ట్రైలర్ లో పూరి మార్క్ విజువల్స్ తో పాటు ఇమోషనల్ లవ్ ఎలిమెంట్స్ హైలెట్ అవుతున్నాయి. ట్రైలర్ చివరన ఆకాష్ చెప్పే ‘మేరీ మెహబూబా జిందాబాద్ డైలాగ్…’ అనే డైలాగ్ యూత్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తుంది. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ కానుంది.

ఆకాష్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. మే 11 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజవుతుంది.