పూరీ చెప్పిన నిజాలు

Wednesday,October 19,2016 - 03:50 by Z_CLU

*  ‘ఇజం’ – పదేళ్ల కిందటి కథ

చాలా కథలు రాస్తుంటాను కానీ ఈ కథ కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఇజం కథ తో ఓ పవర్ ఫుల్ జర్నలిస్ట్ చేసే ఫైట్ చూపించాను. 10 ఏళ్ళ క్రితం  కథైనా ప్రస్తుతం సమాజం లో జరుగుతున్న కొన్ని సమస్యలను చేర్చడం జరిగింది. అలా అని నా హీరో ఈ సినిమాలో క్లాసులు పీకడు, సందేశాలు ఇవ్వడు. జస్ట్ అందరి తరుపున పోరాడతాడంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ పవర్ ఫుల్ కథ తో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసా.

*అనూప్ కి బాగా కనెక్ట్ అయిపోయా..

అనూప్ మ్యూజిక్ కి బాగా కనెక్ట్ అయిపోయా. అందుకే తనతోనే రిపీటెడ్ గా వర్క్ చేస్తున్నా. ఈ సినిమాలో నాతో ఓ పాట రాయించి నాతోనే పాడించాడు. ఈ సినిమాలో నేను పాడిన సాంగ్ తో పాటు రెండు మెలోడీస్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

siv_85470067

* ఆ హీరో ఒప్పుకోలేదు…

అభిషేక్ తో  ‘టెంపర్’ రీమేక్ చెయ్యాలనుకున్నా. ఇటీవలే తనకు ఆ సినిమా కూడా చూపించాను. కానీ అభిషేక్  ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదని చెప్పేశాడు. బాలీవుడ్ లో తప్పకుండా సినిమా చేస్తా… బట్ ఇంకా టైం పడుతుంది…

*ఇంకో వారం ఆగాల్సిందే..

నా నెక్స్ట్ సినిమా గురించి తెలియాలంటే జస్ట్ ఇంకో వారం ఆగాల్సిందే. ఎవరితో చేస్తాననేది సస్పెన్స్.అతి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తాయి.

*రిలీజ్ మాత్రమే లేట్….

ఇక నేను డైరెక్ట్ చేసిన మరో సినిమా ‘రోగ్’ షూటింగ్ పూర్తయ్యింది. కానీ రిలీజ్ లేట్ అయ్యింది. డిసెంబర్ లో ఆ సినిమా రిలీజ్ ఉంటుంది.

siv_85510071

*మహేష్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు..

మహేష్ తో నేను చేయబోయే ‘జనగణమన’ సినిమా ఎప్పుడుంటుందో చెప్పలేను. మహేష్ ను కలిసి కథ కూడా చెప్పా. తనకు బాగా నచ్చింది. కానీ ఎప్పుడు చేస్తామో ఇంకా  క్లారిటీ లేదు.

*ఇంకో మూడేళ్లు పడుతుంది…

 మా అబ్బాయ్ ఆకాష్ ప్రస్తుతం చదువుతున్నాడు. వాడు హీరో అవ్వడానికి ఇంకో మూడేళ్లు పట్టొచ్చు.

siv_85410062

*రవితేజ కి మూడ్ లేదు..

రవితేజతో సినిమా చేసి చాలా ఏళ్ళైంది. ఇద్దరం కలిసి మళ్ళీ ఓ సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం. కానీ రవికి ప్రస్తుతం సినిమా చేసే మూడ్ లేదు. తిరగాలనుకుంటున్నాడు. దాదాపు 15 ఏళ్ల నుండి రెస్ట్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చాం. అందుకే ప్రస్తుతం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. పైగా  నన్ను కూడా సినిమాలు మానేసి తనతో పాటు వచ్చేయమంటున్నాడు..

*ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తా…

మెగాస్టార్ చిరంజీవి గారికి ఓ కథ చెప్పాను. ఆయనకు సెకండ్ హాఫ్ నచ్చలేదు. మళ్ళీ కథ చెప్పే లోపే సినిమా స్టార్ట్ చేసేశారు. మళ్ళీ ఛాన్స్ వస్తే ఆయనతో కచ్చితంగా సినిమా చేయాలని ఉంది.