పూరి జగన్నాథ్ బర్త్ డే స్పెషల్

Thursday,September 28,2017 - 12:46 by Z_CLU

టాలీవుడ్ లో మాసివ్ డైరెక్టర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పూరి సెప్టెంబర్ 28, 1966 లో జన్మించారు. దర్శకుడిగానే కాక నిర్మాత కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న పూరి ఈ రోజు తన 51 వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ…

తన ఫస్ట్ సినిమా ‘బద్రి’ తో యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూరి, ఆ తర్వాత తన సొంత ప్రొడక్షన్ లో దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ తో సక్సెస్ ఫుల్ డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్ గా కూడా తన స్టామినా ఎలివేట్ చేశాడు. ఆ తరవాత వరసగా వచ్చిన ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’ సినిమాలతో ఒక రకంగా మిలీనియం బిగినింగ్ లో టాలీవుడ్ ని రూల్ చేశాడు.

పూరి జగన్నాథ్ కరియర్ లో 2005 నుండి బిగిన్ అయితే 2010 వరకు గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ మూవీతో బిగిన్ అయితే, ఆ తరవాత వచ్చిన ‘పోకిరి’ ఒక రొటీన్ ట్రెండ్ ఫార్మాట్ ని ఫాలో అవుతున్న టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చేసే చాన్స్ కొట్టేసిన పూరి, డిఫెరెంట్ మ్యానరిజం తో చెర్రీని ఇంట్రడ్యూస్ చేయడంలో సక్సీడ్ అయ్యాడు. ఆ తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన బుజ్జిగాడు, నేనింతే, బిజినెస్ మ్యాన్, ఇద్దరమ్మాయిలతో, కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు, టెంపర్ ఇలా వరసగా చెప్పుకుంటూ ఏ స్టార్ తో సినిమా చేసినా, సెన్సేషన్ క్రియేట్ చేయడమే పూరి రియల్ టైమ్ టార్గెట్.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన లక్ ని చెక్ చేసుకున్న పూరి, ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాకి లెజెండ్రీ ఆక్టర్ అమితాబ్ బచ్చన్ తో కూడా పనిచేశాడు. ఈ సినిమా ఆస్కార్ లైబ్రరీ కి సెలెక్ట్  అవ్వడం విశేషం. తన పదిహేడేళ్ళ కరియర్ లో 3 నంది అవార్డులను సొంతం చేసుకున్న పూరి, ఫ్యూచర్ లో ఇంకెన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని, మరెన్నో హైట్స్ కి రీచ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, బర్త్ డే విషెస్ అందజేస్తుంది జీ సినిమాలు.