50 సినిమాలు చేస్తాడు

Tuesday,March 14,2017 - 11:48 by Z_CLU

పూరి జగన్నాథ్ ‘రోగ్’ సినిమా ద్వారా ఇషాన్ అనే యంగ్ హీరోను టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్న సంగతి తెలిసిందే… తను ఇంట్రడ్యూస్ చేయబోతున్న ఇషాన్ గురించి ఇటీవలే ఈ సినిమా ఆడియో వేడుకలో పూరి మాట్లాడుతూ ” నా మొదటి సినిమా ‘బద్రి’ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మొదటి రోజు షూటింగ్ అయిపోయాక మా ప్రొడ్యూసర్ త్రివిక్రమ రావు గారు నా దగ్గరకొచ్చి కౌగిలించుకొని 50 సినిమాలు చేస్తావ్ పో అన్నారు…. ఆయన చెప్పినట్లే ఇప్పటికే ఓ 33 చేశా.. ఆయన నా మీద నమ్మకం తో చెప్పిన మాట ఇప్పుడు ఇషాన్ మీద నమ్మకం తో నేను చెప్తున్నా ఇషాన్ 50 సినిమాలు చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే 50 సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. బ్యాక్ టు బ్యాక్ ఓ 20 ఏళ్ళు కష్టపడితే తప్ప అన్ని సినిమాలు పూర్తి కావు.. సో 50 సినిమాలు పూర్తి చేయగలిగే ఎనర్జీ కసి ఈ సినిమా షూటింగ్ టైంలో నేను ఇషాన్ లో చూశాను. అందుకే ఈ మాట చెప్తున్నా ” అన్నారు. మరి పూరి చెప్పినట్టు ఇషాన్ అన్ని సినిమాలు పూర్తి చేస్తాడా..చూడాలి..