Puri Janaganamana - మళ్లీ తెరపైకి డ్రీమ్ ప్రాజెక్ట్?

Wednesday,January 26,2022 - 03:59 by Z_CLU

Puri Jagannadh’s Janaganamana Project to launch in Bollywood?

పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికొచ్చింది. కొన్నేళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్ కోసం రెడీ చేసిన ఈ కథను వేరే హీరోతో చేయాలని చూస్తున్నాడు పూరి. అప్పటి నుండి ఈ సినిమాకు చాలా మంది పేర్లు వినిపించాయి. ఒకటైంలో యష్ తో పూరి ఈ సినిమా చేయబోతున్నాడనే టాక్ కూడా చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో బజ్ స్టార్ట్ అయింది.

ఈ సినిమాను పూరి బాలీవుడ్ లో చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు పూరి. ఆ సినిమా రిలీజ్ అవ్వగానే మళ్ళీ విజయ్ తోనే ఈ సినిమాను చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్ తో ఓ స్పెషల్ రోల్ చేయించే ఆలోచనలో ఉన్నాడట పూరి. గతంలో అమితాబ్ తో పూరి ‘బుడ్డా’ అనే హిందీ సినిమా తీశాడు. ఆ చనువుతోనే ఇందులో బిగ్ బి తో స్పెషల్ క్యారెక్టర్ చేయించాలనుకుంటున్నాడు పూరి. అలాగే అజయ్ దేవగన్ ని విలన్ గా అనుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బేనర్ పై కరణ్ జోహార్ నిర్మించనున్నారని తెలుస్తుంది.

ఇలా ప్రస్తుతం పూరి తన ఫోకస్ అంతా ‘జనగణమన’ ప్రాజెక్ట్ మీదే పెట్టాడని అంటున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి. తన డ్రీం ప్రాజెక్ట్ తర్వాత పూరి బాలయ్య తో సినిమా చేసే అవకాశం ఉంది.