Puri Jagannadh - హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే నాకు నచ్చదు

Thursday,June 17,2021 - 02:20 by Z_CLU

హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే తనకు నచ్చదంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. హీరోయిన్లను అభిమానులు దేవతల్లా చూస్తారని, అలాంటి హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని, పిల్లల్ని కంటే తను చూడలేనని అంటున్నాడు.

“సినిమా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టం ఉండదు. కోటి మందిలో ఒకరికి అలాంటి అవకాశం వస్తుంది. వాళ్లు చాలా స్పెషల్. వాళ్లు కూడా అందర్లానే పెళ్లిళ్లు చేసుకొని, పిల్లల్ని కనడం నాకు నచ్చదు. అభిమానులకు హీరోయిన్లు దేవతలు. వాళ్ల పర్సుల్లో, మొబైల్ స్క్రీన్స్ లో ఉంటారు. అలాంటి దేవతలు మెటర్నటీ వార్డులో నొప్పులు పడుతుంటే నేను చూడలేను. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు ఉంటుంది. దేవతలకు ఉండదు. కాబట్టి హీరోయిన్లు కూడా దేవతలుగా ఉండడం నాకిష్టం.”

సొసైటీలో చాలా స్పెషల్ గా ఉండే హీరోయిన్లయినా మగాళ్లను దూరం పెట్టాలని కోరుకుంటున్నాడు పూరి. మాయావతి, మమతాబెనర్జీ, జయలలిత లాంటి వాళ్లను హీరోయిన్లు ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నాడు. అటు హాలీవుడ్ లో కూడా చాలామంది స్టార్స్ పెళ్లిని దూరంగా పెట్టారని.. కాబట్టి మన హీరోయిన్లు కూడా మగాళ్లను దూరం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు పూరి.

రంభ, ఊర్వశి, మేనక అన్-మ్యారీడ్ కాబట్టే స్వర్గం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉందని.. అదే వాళ్లు కూడా ప్రెగ్నెంట్స్ అయితే స్వర్గం వేస్ట్ అంటున్నాడు పూరి. ఇప్పటికైనా తన మాటలు విని, హీరోయిన్లంతా దేవతల్లా ఆలోచించాలని.. సింగిల్ ఉమెన్ గా నిలిచి, అందరికీ ఆదర్శంగా ఉండాలని అంటున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics