రామ్ పోతినేని కాదు.. రామ్ చిరుతపులి

Tuesday,July 09,2019 - 12:50 by Z_CLU

రామ్, పూరిది ఫ్రెష్ కాంబినేషన్. ఇప్పటివరకు ఇద్దరూ కలిసి పనిచేయలేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో కలిశారు. ఆ టైమ్ లో రామ్ యాటిట్యూబ్, పూరికి బాగా నచ్చింది. రామ్ తనకు ఎంతగా నచ్చాడో బయటపెట్టాడు పూరి జగన్నాధ్. రామ్ ను చిరుతపులితో పోల్చాడు.

హైద‌రాబాద్ ఇస్మార్ట్ రౌడీకి పోలీసోళ్లు డిప్ప‌లో బొక్క‌బెట్టి, చిప్ప‌లోకి సిమ్‌కార్డ్ పెట్టిండ్రు`అదెందుకు పెట్టారు? పెట్టిన త‌ర్వాత ఏమైంద‌నేదే స్టోరీ. చాలా ఎంట‌ర్‌టైనింగ్ స్టోరీ. రామ్‌నే ఈ సినిమాకు హైలైట్‌. నాకు టెంప‌ర్ సినిమా త‌ర్వాత మంచి హిట్ ప‌డ‌లేదు. విప‌రీత‌మైన ఆక‌లితో ఉంటే నాకు రామ్ దొరికాడు. వెజిటేరియ‌న్ ముసుగులో ఉన్న నాన్ వెజిటేరియ‌న్ కుర్రాడు రామ్‌. నేను త‌న‌నేం మార్చ‌లేదు. త‌న‌లో ఉండే గుణం. త‌ను రామ్ పోతినేని కాదు.. రామ్‌ చిరుత‌పులి.

రామ్ కు సినిమా తప్ప మరో లోకం తెలియదంటున్నాడు పూరి. రామ్ తో పాటు హీరోయిన్లు బాగా చేశారని, మణిశర్మ మరోసారి తనకు ప్లస్ అవుతాడని చెబుతున్నాడు.

రామ్ కు సినిమా త‌ప్ప మ‌రోటి తెలీదు. ఇళ్లు త‌ర్వాత షూటింగే. ప్ర‌తి షాట్‌ను వంద‌శాతం మ‌న‌సుపెట్టి చేస్తాడు. త‌న‌కు హ్యాట్సాఫ్‌. మ‌ణిశ‌ర్మ‌గారు ఐదు మంచి పాట‌ల‌ు ఇచ్చారు. అన్ని పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. బోనాలు టైమ్‌లోనే మా సినిమా రిలీజ్ కావ‌డం.. అందులో బోనాలు సాంగ్ ఉండ‌టం యాదృచ్చికం. నిధి అగ‌ర్వాల్ చాలా హాట్‌. న‌భా చాలా మంచి రోల్‌. బాగా పెర్ఫామెన్స్ చేసింది. ఛార్మి ప్లానింగ్ బావుంటుంది.”

ప్రేక్ష‌కుల ఆశీర్వాదంతో సినిమా పెద్ద హిట్ అయ్యి.. డ‌బుల్ ఇస్మార్ట్ సినిమా కూడా తీయాలని ఉందని, అంత‌కు మించి కోరిక‌లేం లేవంటున్నాడు పూరి జగన్నాధ్. ఈనెల 18న థియేటర్లలోకి రానుంది ఇస్మార్ట్ శంకర్.