పూరి ఆకాష్ ఇంటర్వ్యూ

Tuesday,May 08,2018 - 04:33 by Z_CLU

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కింది మెహబూబా. మే 11 న గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు పూరి ఆకాష్. 1970 ఇండో పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఇమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా గురించి మీడియాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు ఈ హీరో. అవి మీకోసం…

చాలా హ్యాప్పీ…

మా నాన్న చేసిన ఏ సినిమాకు నేనింత కాన్ఫిడెంట్ గా లేను. ఈ సినిమా విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా… నా పదిహేనేళ్ళ కల నిజమయినందుకు చాలా హ్యాప్పీగా ఉంది…

ఈ స్టైల్ లో ఎక్స్ పెక్ట్ చేయలేదు…

మా నాన్న లవ్ స్టోరీస్ అన్ని చాలా డిఫెరెంట్ గా ఉంటాయి. ఈ టైప్ లవ్ స్టోర్ అయితే నేను ఆయన దగ్గరి నుండి ఎక్స్ పెక్ట్ చేయలేదు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ అవుతుంది…

రొటీన్ లవ్ స్టోరీ కాదు…

1971 ఇండో పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉండే లవ్ స్టోరీ. ఆర్మీ ఆఫీసర్ లా కనిపించాలి. నాన్న నాకు 3 మంత్స్ టైమ్ ఇచ్చారు. నేను ఇమ్మీడియట్ గా మా కోచ్ కెవిన్ ని కలిశాను. ఈ రోజు ఆర్మీ ఆఫీసర్ గా ఆ రోల్ లో ఫిట్ అయ్యానంటే ఆయన వల్లే…

చాలా హోమ్ వర్క్ చేశాను…

సోల్జర్స్ ఎలా ఉంటారు.. ఎలా నడుస్తారు.. ఎలా సాల్యూట్ చేస్తారు లాంటి వాటి మీద చాలా రీసర్చ్ చేశాను. డాడీ క్యారెక్టర్ చెప్పాక ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు కనిపించడానికి చాలా ట్రై చేశాను.

స్టోరీని బట్టే ఉంటుంది…

ఇది నా డెబ్యూ కాబట్టి సినిమాలో కావాలని పెట్టిన సీన్స్ ఉండవు. ప్రతి చిన్న సీన్ దగ్గరి నుండి యాక్షన్ ఎలిమెంట్స్ వరకు స్తొరేఇ బట్టే ఉంటాయి… చాలా పవర్ ఫుల్ రోల్ ప్లే చేశాను ఈ సినిమాలో, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లా కనిపిస్తాను…

అందుకే ఆ మాట అన్నాను…

సినిమా చూసిన వాళ్లెవరైనా ఇది నాన్న రెగ్యులర్ సినిమాలా లేదు కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఉంది అంటున్నారు. అందుకే ఈ సినిమాతో ‘నేను నాన్నను లాంచ్ చేస్తున్నాను’ అన్నాను…

రిస్కీ ఫైట్స్…

సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బావుంటాయి. నాకు చిన్నప్పటి నుండి యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఏం చెప్పినా ఎగ్జైట్ మెంట్ తో చేసేశా…

ట్విస్ట్ హైలెట్ సినిమాలో…

సినిమాలో ట్విస్ట్ హైలెట్ అవుతుంది. అందరూ పునర్జన్మ అనగానే ‘మగధీర’ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా చాలా డిఫెరెంట్. ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి కంపారిజన్స్ ఉండవు.

అదృష్టంగా ఫీలవుతున్నా…

రామ్ చరణ్ గారితో లాంచ్ అయ్యాను. ప్రభాస్, మహేష్ బాబు గారితో, పవన్ కళ్యాన్ గారితో  చేశాను. చిన్నప్పుడే అందరి దగ్గర చాలా నేర్చుకోగలిగాను. నా గత సినిమాలతో పోలిస్తే, ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ గా పర్ఫామ్ చేశాను.

ఆయన నా రోల్ మోడల్..

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే చాలా ఇష్టం. ఆయన నాకు దేవుడు… రోల్ మోడల్.

జిందాబాద్ సీన్…

సినిమాలో జిందాబాద్ సీన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా రిలీజయ్యాక ఆ సీన్ కి వచ్చే రెస్పాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.

నెక్స్ట్ సినిమా…

నా నెక్స్ట్ సినిమా కూడా నాన్నతోనే ఉంటుంది. ఆ సినిమా ఏంటి…? ఎలా ఉండబోతుంది అనేది త్వరలో అనౌన్స్ చేస్తాం…

నేహశెట్టి గురించి…

సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్.. టైటిలే హీరోయిన్ రిలేటెడ్ కాబట్టి అమ్మాయి పర్ఫామెన్స్ సినిమాకి బ్యాక్ బోన్. నేహాశెట్టి 100% పర్ఫామ్ చేసింది. ఒక రకంగా తన వల్లే నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం దొరికింది.

చాలా కష్టమనిపించింది…

లొకేషన్ కులుమనాలి అనగానే చాలా ఎగ్జైటెడ్ అయిపోయాం.  కానీ అక్కడకి వెళ్ళాక తెలిసింది. -4 డిగ్రీస్ లో షూటింగ్ జరిగింది.

అదే నేర్చుకున్నాను…

నాన్న లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, సినిమాను నమ్ముకునే బ్రతుకుతున్నారు. అదే నేను ఆయన దగ్గరి నుండి నేర్చుకున్నాను.

ఆ రోజు మర్చిపోలేను…

నాన్న నాకెప్పుడూ ఏ కాంప్లిమెంట్ ఇవ్వలేదు. కానీ ఒకరోజు అక్టోబర్ 12 న మాత్రం సూపర్ ఎగ్జైటెడ్ గా సూపర్ రా అనేశారు. ఆ రోజు నా లైఫ్ లో మర్చిపోలేను.

మ్యూజిక్ డైరెక్టర్…

సందీప్ చౌతాకి థాంక్స్ చెప్పుకోవాలి. సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాప్పీగా ఉంది. BGM కూడా అంతే అద్భుతంగా ఇచ్చారు.

దిల్ రాజు గారు…

ఈ సినిమాను ఆయన టేకప్ చేశారు, చాలా హ్యాప్పీ. నాన్న, దిల్ రాజు గారి కాంబినేషన్ లో రిలీజైన ఇడియట్, పోకిరి, తరవాత ఇప్పుడు మెహబూబా.. ఈ సినిమాకు కూడా ఆ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందనే అనుకుంటున్నా…