ఆకాష్ పూరి కొత్త సినిమా అప్డేట్స్

Sunday,January 13,2019 - 11:08 by Z_CLU

‘మెహబూబా’ తో హీరోగా పరిచయమైన పూరి తనయుడు ఆకాష్ పూరి నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో సినిమా శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమా తో అనిల్  టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి రానుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న టీం ప్రెజెంట్ లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నారు.  యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.