PSV గరుడవేగ 5 రోజుల కలెక్షన్లు

Thursday,November 09,2017 - 05:24 by Z_CLU

రాజశేఖర్ PSV గరుడవేగ రిలీజైన ప్రతి సెంటర్ లోను సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ 5 రోజుల్లో 15 కోట్లు వసూలు చేసి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. టీజర్ రిలీజయినప్పుడే ఈ సినిమాపై క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడంలో సూపర్ సక్సెస్ అయ్యారు మేకర్స్.

రాజశేఖర్ NIA ఆఫీసర్ గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పూజా కుమార్ హీరోయిన్ గా నటించింది. రాజశేఖర్ కరియర్ లో పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అనిపించుకున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ సెకండ్ వీక్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకు M. కోటేశ్వర రాజు ప్రొడ్యూసర్. శ్రీచరణ్ మ్యూజిక్ కంపోజర్.