పవన్ అభిమానులకు మ్యూజికల్ గిఫ్ట్

Saturday,September 02,2017 - 10:26 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పండగ రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు పవన్ పుట్టినరోజు. తన 46వ ఏట అడుగుపెట్టిన పవన్ ఈరోజు ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ అందించాడు. పుట్టినరోజుకు ఒకరోజు ముందే కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన పవన్.. ఈరోజు తన పుట్టినరోజు కానుకగా ఓ మ్యూజికల్ ట్రీట్ అందించాడు. ఆ వీడియోనే ఇది.

ఏకంగా పవన్ కొత్త సినిమాలోంచి ఓ సాంగ్ బిట్ ను ఈ మ్యూజికల్ వీడియోలో పొందుపరచడం విశేషం. వీడియోలో మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ పాట పాడుతుంటే.. ఆ ఫీల్ ను దర్శకుడు త్రివిక్రమ్ ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. ఇక వీడియోకు ఫినిషింగ్ టచ్ అన్నట్టు.. లాస్ట్ లో పవన్ కల్యాణ్ క్లిప్ ను పెట్టి ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.