అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ రిలీజ్

Monday,November 27,2017 - 12:34 by Z_CLU

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజైంది. పవన్ కల్యాణ్ ను మోస్ట్ స్టయిలిష్, పవర్ ఫుల్ గా చూపించే స్టిల్ తో ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు. 2 రోజుల కిందట ప్రీ-లుక్ విడుదల చేసిన యూనిట్.. పవన్ కు చెందిన ఆ షాడో ఇమేజ్ ను టైటిల్ లో చొప్పించింది.

మొన్నటివరకు పవన్ సినిమాకు సంబంధించి దాదాపు అరడజను టైటిల్స్ తెరపైకొచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కోపేరును ప్రస్తావిస్తూ వచ్చారు. రీసెంట్ గా అజ్ఞాతవాసి అనే టైటిల్ పై ఎక్కువ చర్చ జరిగింది. తాజాగా అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ తో టైటిల్ పై వచ్చిన పుకార్లకు చెక్ పడింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వారణాసిలో కొనసాగుతోంది. మూవీకి సంబంధించి ఇదే ఆఖరి షెడ్యూల్. హారిక&హాసిని క్రియేషన్స్ బ్యానర్ రాధాకృష్ణ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో అనిరుధ్, తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.