ఖైదీపై ఫృధ్వీ కామెంట్స్

Wednesday,January 04,2017 - 05:30 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150 ‘ రిలీజ్ కి రెడీ అవుతుంది. జనవరి 11 న సంక్రాంతి కానుకగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై కమెడియన్ ఫృథ్వి కామెంట్ చేశాడు.

  ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ చేసిన ఫృధ్వి… “చిరంజీవి గారి 150 సినిమాలో నటించడం నా అదృష్టం. కానీ ఆ సినిమాలోంచి నేను నటించిన సీన్స్ కొన్ని తొలిగించడం నా దురదృష్టం. సంక్రాంతి రోజున మా అమ్మ చనిపోయినంత బాధగా ఉంది” అంటూ సోషల్ మీడియా ద్వారా తన బాధను తెలియజేశాడు.

prudhvi-comment