అజ్ఞాతవాసి కోసం ప్రమోషనల్ సాంగ్

Friday,December 08,2017 - 06:59 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే రిలీజైన ‘బయటికొచ్చి చూస్తే’ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తరవాత మళ్ళీ అదే రేంజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడానికి డిసెంబర్ 12 న  ‘గాలి వాలుగా’ అనే సాంగ్ ని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. అయితే వీటితో పాటు ఈ సినిమా ప్రమోషన్ సాంగ్ ని తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉంది ‘అజ్ఞాతవాసి’ టీమ్.

ప్రస్తుతం ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ ని నిర్మిస్తుంది సినిమా టీమ్. అయితే ఈ ప్రాసెస్ ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న అనిరుద్ ఆల్ రెడీ ఈ సాంగ్ ని కంపోజ్ చేసేశాడని తెలుస్తుంది. సినిమా రిలీజ్ కి ముందే సర్ ప్రైజెస్ తో టాలీవుడ్ లో పవర్ జెనెరేట్ చేస్తున్న ‘అజ్ఞాతవాసి’ మేకర్స్, ఈ సాంగ్ ని కరెక్ట్ టైమ్ చూసుకుని రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

ఖుష్బూ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ తో పాటు కీర్తి సురేష్ నటించింది. హారిక & హాసిని క్రియేషన్స్ పై తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్.