నిర్మాత 'కోనేరు సత్యనారాయణ' ఇంటర్వ్యూ

Monday,July 29,2019 - 05:20 by Z_CLU

బెల్లంకొండ సాయి శ్రీనివాస హీరోగా తమిళ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ‘రాక్షసుడు’ ఆగస్ట్ 2న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

 

ఇదే మొదటి సారి

నాది ఎడ్యుకేషన్ ఫీల్డ్.. గతంలో మా అబ్బాయి హీరోగా తెరకెక్కిన ‘జీనియస్’ సినిమాకు పార్ట్నర్ గా వ్యవహరించాను. ఈ సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారడం జరిగింది. ‘ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్’ బ్యాన‌ర్‌ లో ‘రాక్షసుడు’ మొదటి సినిమా అయినందుకు సంతోషంగా ఉంది.

పోటీ పడి మరీ

తమిళ్ లో ‘రట్సా సన్’ సినిమా బాగుందని చెప్తే నేను చెన్నై వెళ్లి మరీ చూసాను. నాకు తమిళ్ రాదు. సినిమా కూడా సగమే అర్థం అయింది. అయినా బాగా కనెక్ట్ అయ్యాను. అందుకే పోటీ పడి మరీ సినిమా తెలుగు రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాను.

హవీష్ కోసమే

ఈ సినిమాను హవీష్ కోసం కొనుగోలు చేయడం జరిగింది. అయితే హవీష్ అప్పటికే సెవెన్ అనే మరో థ్రిల్లర్ సినిమా చేస్తుండడంతో బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ సినిమాలు అవుతాయన్న ఉద్దేశ్యంతోనే తర్వాత బెల్లం కొండని అప్రోచ్ అయ్యాము. తనకి పర్ఫెక్ట్ గా సూటయ్యే సబ్జెక్ట్ ఇది. సినిమా రిలీజయ్యాక సాయి కి మంచి ప్రశంసలు వస్తాయి.

చేంజెస్ వద్దనుకున్నాం

‘రాక్షసుడు’ పర్ఫెక్ట్ రీమేక్ అనిచెప్పొచ్చు. ఎటువంటి చేంజెస్ చేయకూడదని ముందే డిసైడ్ అయ్యాను. అదే విషయాన్ని రమేష్ వర్మకి కూడా చెప్పడం జరిగింది. అందుకే ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టు తెరకెక్కించాం. నిజానికి అదే కష్టం అనిపించింది.

అందుకే ఆ టైటిల్

మన తెలుగు సినిమాల్లో మ్యాగ్జిమం హీరో క్యారెక్టర్ పరంగా టైటిల్ పెడతాం. కానీ ఈ సినిమాకు విలన్ క్యారెక్టర్ ని ఉద్దేశ్యించి టైటిల్ పెట్టడం జరిగింది. కథకి పర్ఫెక్ట్ టైటిల్.

వంద రోజుల్లోనే

సినిమాకు సంబంధించి టోటల్ షూట్ వంద రోజుల్లో పూర్తి చేసాం. మేము అనుకున్న రోజుల్లోనే పూర్తి చేయగలిగాం. కాకపోతే క్లైమాక్స్ ఫైట్ కోసం కొన్ని రోజులు షూటింగ్ పొడగించడం జరిగింది. సినిమాలో క్వాలిటీ ఏ మాత్రం మిస్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా చూసాక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడతారు.

 

అనుపమ యాప్ట్

ముందుగా హీరోయిన్ క్యారెక్టర్ కి రాశి ఖన్నా లాంటి పెద్ద స్టార్స్ ని అనుకున్నాం. కానీ అనుకోకుండా అనుపమని తీసుకున్నాం. ఆ అమ్మాయి చాలా బాగా నటించింది. ఒక టీచర్ ఎలా ఉంటుందో.. అచ్చం అలాగే సినిమాలో కనిపిస్తుంది.

 

 

 

అదే కష్టం 

ఏ సినిమాకైనా ప్రీ ప్రొడక్షన్ అనేది పక్కాగా చెయ్యాలి. సినిమకు కంటెంటే ముఖ్యం. దానికోసమే ఎక్కువ సమయం తీసుకోవాలి. నా దృష్టిలో ప్రీ ప్రోదక్షనే కష్టం ప్రొడక్షన్ సులభమే.  పోస్ట్ ప్రొడక్షన్ కి సంబధించిన వర్క్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా సినిమాను సరిగ్గా  రిలీజ్ చేసుకోగలగాలి.

 

నెక్స్ట్  సినిమాలు 

నెక్స్ట్ సినిమాల కోసం కథలు వింటున్నాం. ఓ రెండు కథలు ఫైనల్ చేసే పనిలో ఉన్నాం. అందులో ఒకటి హవీష్ తో ప్లాన్ ఉంటుంది. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాం.