మహేష్ బాబుతో త్వరలో సినిమా – అనిల్ సుంకర

Tuesday,March 13,2018 - 01:32 by Z_CLU

ప్రస్తుతం ‘కిర్రాక్ పార్టీ’ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. కన్నడ సూపర్ హిట్ ‘కిరిక్ పార్టీ’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తమకున్న అనుబంధం గురించి చెప్పుకున్నాడు ఈ ప్రొడ్యూసర్.

“మహేష్ బాబు తో మా బ్యానర్ లో త్వరలో సినిమా తప్పకుండా చేస్తాం. ఈ సారి సినిమా చేశామంటే కంపల్సరీగా ట్రెండ్ సెట్టరే.  మాకు మహేష్ బాబు తో మంచి రిలేషన్ షిప్ ఉంది’ అని చెప్పుకున్నాడు అనిల్ సుంకర.

ఇప్పటి వరకు మహేష్ బాబుతో దూకుడు, 1- నేనొక్కడినే, ఆగడు సినిమాలను నిర్మించిన అనిల్ సుంకర ఈ సారి మహేష్ బాబుతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల డైరెక్షన్ లో ‘భరత్ అనే నేను’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు, ఈ సినిమా తరవాత వంశీ పైడిపల్లి సినిమాతో సెట్స్ పైకి వస్తాడు.