నితిన్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్

Friday,April 24,2020 - 12:30 by Z_CLU

ఈ ఏడాది ఆరంభంలో ‘భీష్మ’ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నితిన్ నెక్స్ట్ ‘రంగ్ దే’, చంద్రశేఖర్ ఏలేటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాల తర్వాత ఓ రీమేక్ సినిమాను స్టార్ట్ చేస్తాడు నితిన్. ఈ మూవీకి తాజాగా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘అంధాదున్’ను తెలుగులో సొంత బ్యానర్ పై రీమేక్ చేస్తున్నాడు నితిన్. సినిమా కూడా ఈమధ్య లాంఛ్ అయింది. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను తీసుకున్నారు.

నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాలో నటిస్తుంది. నితిన్ సినిమా ఆమెకు తెలుగులో మూడోది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాబోతోంది ఈ రీమేక్.