రానా సినిమాలో ప్రియమణి

Friday,April 24,2020 - 12:21 by Z_CLU

దగ్గుబాటి రానా ప్రస్తుతం వేణు ఉడుగుల డైరెక్షన్ లో ‘విరాటపర్వం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనుందట. ప్రియమణి ఇప్పటివరకు చేయని నక్సలైట్ పాత్ర ఇందులో చేసిందని సమాచారం.

ఇప్పటికే ప్రియమణి కి సంబంధించి షూట్ కూడా ఫినిష్ చేసిందట యూనిట్. కేరళ , వికారాబాద్ , మెదక్ అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తొంబై శాతం టాకీ పూర్తి చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తెలంగాణలో నక్సలిజం పీక్స్ లో ఉన్న టైమ్ లో జరిగిన యదార్థ ఘటనలకు కాస్త ఫిక్షన్ జోడించి వేణు ఉడుగుల ఈ కథ రాసుకున్నాడు. సినిమాలో రానా కూడా నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.