ప్రియమణి బర్త్ డే స్పెషల్

Thursday,June 04,2020 - 12:03 by Z_CLU

హీరోయిన్లలో కొందరు గ్లామర్ పాత్రలకే సరిపోతారు. మరికొందరు లీడ్ క్యారక్టర్స్ చేయగలరు. కానీ రెండూ చేసే హీరోయిన్లు చాలా తక్కువమంది. ఆ లిస్ట్ లో మస్ట్ గా కనిపించే పేరు ప్రియమణి. గ్లామర్ రోల్ అయినా, ఛాలెంజింగ్ పాత్ర అయినా ప్రియమణికి ఒకటే. తనదైన మార్క్ వేయాల్సింది. ఈరోజు ప్రియమణి పుట్టినరోజు.

ఉత్తమనటిగా జాతీయ అవార్డ్ అందుకున్న నటి ప్రియమణి. సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేసి ప్రతి భాషలో బెస్ట్ అనిపించుకుంది ప్రియమణి. ఎవడే అతగాడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ.. పెళ్లైన కొత్తలో సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది.

ఆ సినిమా సక్సెస్ తర్వాత ప్రియమణి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్టీఆర్ తో చేసిన యమదొంగతో ఆమె హీరోయిన్ గా పీక్ స్టేజ్ కు వెళ్లింది. ఆ తర్వాత సీనియర్లు, యంగ్ స్టర్స్ అనే తేడాలేకుండా అందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది.

మన ఊరి రామాయణం FULL MOVIE (కన్నడ)

ప్రకాష్ రాజ్ తో చేసిన మనఊరి రామాయణం సినిమా ప్రియమణి కెరీర్ లోని బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే, మరోవైపు తన మనసుకు నచ్చిన పాత్రలు చేస్తోంది ప్రియమణి.

ఇందులో భాగంగా విరాటపర్వంలో ఆమె కామ్రేడ్ భారతక్క అనే పాత్రను పోషిస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె నక్సలైట్ గా కనిపించనుంది. ప్రియమణి కెరీర్ లోనే ఇదొక డిఫరెంట్ రోల్.

ఈ మూవీతో పాటు వెంకీ సరసన నారప్ప అనే సినిమా చేస్తోంది ప్రియమణి. ఇందులో కూడా ఆమెది చాలా కీలకమైన, ప్రత్యేకమైన పాత్ర. ఈ పుట్టినరోజు సందర్భంగా.. ఈ రెండు సినిమాల నుంచి ప్రియమణి ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేశారు.

Happy BirthDay Priyamani