అల్లు అర్జున్ హీరోయిన్ గా ప్రియ వారియర్

Wednesday,January 23,2019 - 12:02 by Z_CLU

అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని మిస్సయింది సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా వారియర్. నిజానికి బన్ని రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘నా పేరు సూర్య’ సినిమాలో అనూ ఇమ్మాన్యువేల్ కన్నా ముందు ప్రియా వారియర్ నే అప్రోచ్ అయ్యారట మేకర్స్, కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆ ఛాన్స్ మిస్సయింది ప్రియా వారియర్. ఆ విషయాన్ని రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో చెప్పుకుంది.  

ఫస్ట్ సినిమా ‘ఒరు అదార్’ టీజర్ తోనే ఆల్మోస్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేసేసిన ప్రియా, తన అప్ కమింగ్ మూవీ ‘శ్రీదేవి బంగ్లా’ టీజర్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ‘ఒరు అదార్ లవ్’ తనకే స్థాయి అటెన్షన్ ని తెచ్చి పెట్టిందో, ‘శ్రీదేవి బంగ్లా’ కూడా తన చుట్టూ అదే స్థాయి కాంట్రవర్సీస్ క్రియేట్ చేసింది. అయితే ప్రియా మాత్రం వీటన్నినింటికీ ప్రిపేర్డ్ గా ఉన్నట్టే అనిపిస్తుంది.

‘శ్రీదేవి బంగ్లా’ టీజర్ కి సంబంధించినంత వరకు ఆ బాధ్యత సినిమా డైరెక్టర్ దే. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ  సినిమాని ఎలా ప్రమోట్ చేస్తే రీచ్ అవుతుందనేది ఫిల్మ్ మేకర్స్ స్ట్రాటజీ. కాబట్టి దానికి, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ టీజర్ చుట్టూ ఎంత కాంట్రవర్సీ క్రియేట్ అయిందో, నా పర్ఫామెన్స్ కి కూడా అదే స్థాయిలో అప్రీసియేషన్ దక్కింది’ అని చెప్పుకుంది ప్రియా వారియర్.