తెలుగులోకి ప్రియా వారియర్

Sunday,December 23,2018 - 12:01 by Z_CLU

అమ్మాయి ఓర‌ చూపు చూస్తే వ‌ల‌లో ప‌డ‌ని అబ్బాయిలు ఉండ‌ర‌ని అంటారు. మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ విష‌యంలో అది మ‌రోసారి రుజువైంది. కాక‌పోతే ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ మ‌రో అడుగు ముందుకేశారు. ఆమె కొంటెగా కంటి సైగ చేస్తే రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి మ‌రీ యువ‌కులు ఆమె గురించి ఆరా తీశారు. చిన్న వీడియోతో యావ‌త్ భార‌త‌దేశాన్ని ఉర్రూత‌లూగించింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.

యువ‌కుల్లో అంత‌టి క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రియా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆధార్ ల‌వ్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో సుఖీభ‌వ సినిమాస్ సంస్థ విడుద‌ల చేస్తోంది. ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి నిర్మాత‌లు. ఒమ‌ర్ లులు ద‌ర్శ‌కుడు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా  ఫిబ్ర‌వ‌రి 14న  `ల‌వ‌ర్స్ డే` సినిమా విడుదలకానుంది.

2018లో గూగుల్‌లో టాప్‌లో ట్రెండింగ్‌లో ఉన్న అమ్మాయి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. త‌న క‌నుసైగ‌తో ఆమె చేసిన మాయ అంత గొప్ప‌ది.  తెలుగులోనూ ఆ అమ్మాయికి విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ప్రియాని హీరోయిన్‌గా పెట్టి తెలుగులో సినిమా చేయ‌డానికి  చాలా మంది ట్రై చేస్తున్నారు. యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా ప్రతి సామాజిక మాధ్య‌మంలోనూ ఆమె పేరును జ‌పించే వారి సంఖ్య అత్య‌ధికం.