ఆ కామెంట్స్ నన్ను బాధపెట్టాయి

Wednesday,June 03,2020 - 05:28 by Z_CLU

ప్రియా వారియర్ భయపడి సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయింది. లేదు, ఆమె కేవలం పబ్లిసిటీ కోసమే సోషల్ మీడియా వదిలేసింది. ప్రియా వారియర్ కు అవకాశాలు తగ్గి ముఖం చూపించలేక సోషల్ మీడియా నుంచి క్విట్ అయింది.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ప్రియా వారియర్ పై లెక్కలేనన్ని కామెంట్స్ పడ్డాయి. వాటన్నింటికీ సింగిల్ సమాధానం ఇస్తూ సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చింది ప్రియా వారియర్. ఈ సందర్భంగా ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది.

“బ్రేక్ తీసుకోవడానికి పెద్ద రీజన్ ఏమీ లేదు. మానసిక ప్రశాంతత కోసమే బ్రేక్ తీసుకున్నాను. కొన్ని వారాల పాటు ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తున్నాను.”

ఈ గ్యాప్ లో తనపై వచ్చిన కామెంట్స్ అన్నీ చదివానంటోంది ప్రియా వారియర్. వాటిలో ఒక్క కామెంట్ మాత్రం ఆమెను బాగా బాధపెట్టిందట. కేవలం ప్రచారం కోసమే సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయాననే కామెంట్ చూసి బాధపడ్డానంటోంది ప్రియా వారియర్.