‘మై డియర్ మార్తాండం’ ఫస్ట్ లుక్

Tuesday,July 10,2018 - 06:51 by Z_CLU

కమెడియన్ పృథ్వీ హీరోగా నటించిన సినిమా ‘మై డియర్ మార్తాండం’. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

30 రోజుల్లో లాయర్ అవ్వడం ఎలా…?’ అనే బుక్ చదివి డిఫెన్స్ లాయర్ గా ప్రాక్టీస్ చేసే ఒక వ్యక్తి ఒక క్రిమినల్ కేసుని ఎలా హ్యాండిల్ చేశాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ ప్రాసెస్ లో జెనెరేట్ అయ్యే కామెడీ సినిమాలో హైలెట్ పాయింట్ కానుంది.

పృథ్వీ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా హరీష్ K.V. డైరెక్షన్ లో తెరకెక్కింది. సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించిన ఈ సినిమాకి పవన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.