రాజా చేయి వేస్తే...

Monday,September 26,2016 - 04:14 by Z_CLU

కేవలం తన సినిమాలనే ప్రచారం చేసుకోవాలని.. తన సినిమాలే ఆడాలని మహేష్ ఎప్పుడూ అనుకోడు. తనతో పాటు మిగతా హీరోల సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఎన్టీఆర్, పవన్ లాంటి సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చినా… మిగతా హీరోల సినిమాల ఫంక్షన్లకు హాజరైనా కారణం ఇదే. తాజాగా సూపర్ స్టార్.. మరో హీరోకు ప్రచారం చేసిపెట్టడానికి సిద్ధమయ్యాడు.

naruda-donaruda

   ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ తర్వాత సుమంత్ చాలా గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రం నరుడా డోనరుడా. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన విక్కీ డానర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు… సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి సినిమా పట్ల మహేష్ బాబు ఫ్యాన్స్ లో కూడా క్యూరియాసిటీ పెరిగింది. త్వరలోనే ఈ మూవీ డిజిటల్ పోస్టర్ ను కూడా మహేష్ ఆవిష్కరించబోతున్నాడు. ఇప్పుడు మాత్రమే కాదు…తన క్లోజ్ ఫ్రెండ్ సుమంత్ కోసం గతంలో వచ్చిన సత్యం సినిమాకు కూడా మహేష్ ప్రచారం చేశాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు తాజా చిత్రంపై కూడా పాజిటివ్ సెంటిమెంట్ పడింది.

తన వాళ్ల సినిమాలకు ప్రచారం చేయడానికి మహేష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. పవన్ నటించిన జల్సా సినిమాలో మహేష్ గొంతు వినిపిస్తుంది. ఎన్టీఆర్ బాద్ షా మూవీలో కూడా మహేష్ వాయిస్ వినిపిస్తుంది. ఇలా తనవాళ్ల కోసం మహేష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.