రామ్ చరణ్ యాక్టివ్ గానే ఉన్నాడు

Saturday,March 21,2020 - 03:29 by Z_CLU

“పేరుకే నిర్మాత. అంత యాక్టివ్ గా మాత్రం ఉండడం లేదు. వ్యవహారాలన్నీ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థే చూసుకుంటోంది.”

ఆచార్య సినిమాకు సంబంధించి నిర్మాత రామ్ చరణ్ యాక్టివ్ గా ఉండడం లేదని, బరువంతా మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ మీద వేశాడని ఓ సెక్షన్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. దీన్ని ఆచార్య యూనిట్ సీరియస్ గా తీసుకుంది. ఏకంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

ఆచార్య షూటింగ్ లో రామ్ చరణ్ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడని, అన్ని వ్యవహారాల్ని తామిద్దరం సమానంగా పంచుకుంటున్నామని మ్యాట్నీ ఎఁటర్ టైన్ మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆచార్య మూవీ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ ఇన్-యాక్టివ్ గా ఉన్నారంటూ వచ్చిన గాసిప్స్ ను యూనిట్ కొట్టిపారేసింది.