ప్రీమియర్ మూవీ: కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని

Saturday,July 14,2018 - 02:48 by Z_CLU

సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమా కృష్ణానది ఒడ్డునే సుఖాంతమవుతుంది. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన కృష్ణ, రాధా కాలేజ్ లోను మంచి ఫ్రెండ్స్. కృష్ణ తన ప్రేమను రాధకు చెప్పాలనుకునేలోపు, అనుకోని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు.

ఆ తరవాత ఇంజినీరింగ్ చదివేటప్పుడు, ఆ తరవాత మారెన్నో సందర్భాల్లో కలుసుకున్న వీళ్ళిద్దరూ ఏదో ఒక కారణంతో తమ ప్రేమను వ్యక్తం చేసుకోకుండానే దూరమవుతుంటారు. వాళ్ళు విడిపోవడానికి గల కారణాలేంటి..? ఈ ప్రేమ జంటకు కృష్ణానదికి ఉన్న సంబంధమేంటి..? ఈ విషయం తెలియాలంటే ‘జీ సినిమాలు’ ఛానెల్ లో రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ప్రీమియర్ మూవీ చూడాల్సిందే.

ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ కు ఎంపికై, ఏకంగా అవార్డు కూడా సొంతం చేసుకుంది. చంద్రు డైరక్ట్ చేసిన ఈ సినిమా బెస్ట్ రొమాంటిక్ ఫిలిం అవార్డు గెలుచుకుంది.

నటీనటులు : సుధీర్ బాబు, నందిత రాజ్
ఇతర నటీనటులు : పోసాని, సప్తగిరి, ఎమ్మెస్ నారాయణ, ప్రగతి, చైతన్య కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ : హరి
డైరెక్టర్ : R. చంద్రు
ప్రొడ్యూసర్ : శ్రీధర్ లగడపాటి
రిలీజ్ డేట్ : 19 జూన్ 2015