'దసరా' కానుకగా 'ప్రేమమ్'

Wednesday,August 24,2016 - 01:02 by Z_CLU

నాగ చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం ‘ప్రేమమ్’. ప్రస్తుతం చిత్రీకరణ తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు  జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. యువసామ్రాట్ ‘అక్కినేని నాగార్జున’ (ఆగస్టు 29) పుట్టిన రోజు కానుకగా ‘ఎవరే’ పాట వీడియోను,  స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్బంగా సెప్టెంబర్ 20న  ఆడియోను విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్..