కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్...

Saturday,October 15,2016 - 02:30 by Z_CLU

అక్కినేని యువ హీరో నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ ఇటీవలే విడుదలై సక్సెస్ బాటలో దూసుకెళ్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కలిపి 12 కోట్ల షేర్ అందుకుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుండడం తో అక్కినేని ఫామిలీ తో పాటు అక్కినేని ఫాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు….

    ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా దుమ్ముదులుపుతోంది. గురువారానికి ఈ సినిమాకు 6లక్షల 24 వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ప్రేమమ్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వాలనే తన కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నాడు చైతూ.