ప్రేమకథా చిత్రమ్ టీజర్ రివ్యూ

Friday,December 21,2018 - 04:11 by Z_CLU

సుమంత్ అశ్విన్ ‘ప్రేమకథా చిత్రమ్ 2’ టీజర్ రిలీజయింది. గతంలో రిలీజైన ప్రేమ కథా చిత్రమ్ సినిమా, హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్స్ తో టాలీవుడ్ లో సరికొత్త సీజన్ క్రియేట్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘ప్రేమకథా చిత్రమ్ 2’ సీక్వెల్  టీజర్   ని ఈ రోజు రిలీజ్ చేశారు మేకర్స్.

సుమంత్ అశ్విన్, నందితా శ్వేత ని గొడ్డలి తో చంపే ప్రయత్నం చేసే సీన్ తో బిగిన్ అయ్యే ఈ టీజర్, హారర్ సినిమాలని ఇష్టపడే వారికి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. . ‘అప్పటి వరకు సరదాగా కలిసి ఉన్న ఫ్రెండ్స్, అప్పటికప్పుడు వైల్డ్ గా మారి ఒకరినొకరు చంపుకుంటారా…?’ అసలు ఈ ఇన్సిడెంట్స్ వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏమై ఉంటుందనే క్యూరియాసిటీ రేజ్ చేస్తుంది ఈ సినిమా టీజర్.

హరికిషన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి J.B. మ్యూజిక్ కంపోజ్ చేశాడు. R. సుదర్శన్ రెడ్డి ఈ సినిమాని R.P.A. క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.