ప్రీతీ అశ్రాని చెప్పిన 'A' విశేషాలు

Tuesday,March 02,2021 - 06:20 by Z_CLU

‘మళ్ళీ రావా’ , ‘హ్యాపీ వెడ్డింగ్’ , ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాల్లో నటించిన ప్రీతీ అశ్రాని ఈ శుక్రవారం ‘A’ అనే థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రీతీ సినిమా గురించి , తన క్యారెక్టర్ గురించి కొన్ని విషయాలు మీడియాతో చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు తన మాటల్లోనే.

 

యూనిక్ స్క్రిప్ట్

ఇప్పటి వరకు ఆడియన్స్ చాలా థ్రిల్లర్ సినిమాలు చూసి ఉండొచ్చు. కానీ ‘A’లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చూసి ఉండరు. ఇది యూనిక్ స్క్రిప్ట్ తో తెరకెక్కిన డిఫరెంట్ ఫిలిం. సినిమా చూసేటప్పుడు ప్రతీ సీన్ తర్వాత ఏం జరుగుతుందో ? అనే క్యూరియాసిటీ నెలకొనెలా సినిమా ఉంటుంది.

 

నా అదృష్టం

సినిమాలో నాలుగు షేడ్స్ ఉన్న పల్లవి అనే క్యారెక్టర్ చేశాను. టీనేజ్ అమ్మాయి, గర్ల్ ఫ్రెండ్ , భార్య , తల్లి గా కనిపిస్తాను. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి క్యారెక్టర్ లభించడం నా అదృష్టం. సినిమా చూసాక ప్రీతీ ఇలాంటి రోల్ కూడా చేస్తుందా ? అని అందరు అనుకుంటారు. నటిగా నా కెరీర్ కి ప్లస్ అయ్యే సినిమా ఇది.

 

ఆ రెండు కష్టం

సినిమాలో భార్య , తల్లి గా కనిపించడానికి చాలా కష్టపడ్డాను. సారీ కట్టుకోవడం ఆ సారీ తో కొన్ని మేనరిజమ్స్ చేయడం కొత్తగా అనిపించింది. సారీ కట్టుకొని చేసిన సీన్స్ మానిటర్ లో చూస్తే నేనెనా ? అనిపించింది. నా క్యారెక్టర్ లో ఆ రెండు షేడ్స్ నాకు బాగా నచ్చాయి.

 

ఆయనతో డిస్కస్ చేస్తూ

ఈ రోల్ నెరేట్ చేసినప్పుడు నేను రోల్ కి బెస్ట్ ఇవ్వగలనా ? లేదా అనే భయమేసింది. కానీ డైరెక్టర్ యుగంధర్ ముణి గారు నాకు చాలా దైర్యం ఇచ్చారు. ప్రతీ సీన్ ఆయనతో డిస్కస్ చేసి చేశాను. నా క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నా. సినిమా చూసి ఆడియన్స్ అదే ఫీలయితే నటిగా సంతోష పడతా.

 

మ్యూజిక్ హైలైట్

సినిమాలో సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. కచ్చితంగా ఆడియన్స్ మ్యూజిక్ కి ఇంప్రెస్ అవుతారు. అలాగే విజువల్స్ కూడా ఎట్రాక్ట్ చేస్తాయి.