నాగ చైతన్య తో ఆ దర్శకుడి సినిమా కన్ఫర్మ్ ?

Sunday,February 10,2019 - 12:40 by Z_CLU

వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ స్పీడ్ పెంచాడు నాగ చైతన్య.. ప్రస్తుతం ‘మజిలీ’ సినిమా చేస్తున్న చైతు త్వరలో దిల్ రాజు బ్యానర్ లో శశి అనే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత చైతూ ప్రవీణ్ సత్తారు తో ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ కాంబో సినిమా  కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఇటివలే చైతూ కి స్క్రిప్ట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట ప్రవీణ్.

ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్ పై దృష్టి పెట్టిన ప్రవీణ్ ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఇదే అనే టాక్ వినిపిస్తుంది. హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తాడని సమాచారం.