'ప్రతి రోజు పండగే' షూటింగ్ పూర్తి !

Tuesday,November 26,2019 - 01:04 by Z_CLU

సాయి తేజ్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ప్రతి రోజు పండగే’ షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజమండ్రి పరిసరాల ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటివలే అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సాంగ్ షూట్ తో టోటల్ షూట్ కంప్లీట్ చేసుకుంది.

విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్య రాజ్ కీలక పాత్రలో నటిస్తుండగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2, యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. డిసెంబర్ 20 న సినిమా థియేటర్స్ లోకి రానుంది.