ప్రతి రోజూ పండగే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,December 23,2019 - 01:27 by Z_CLU

పాజిటివ్ టాక్ పనిచేసింది. కామెడీ వర్కవుట్ అయింది. ప్రతి రోజూ పండగే సినిమా హిట్ దిశగా దూసుకుపోతోంది. నిన్నటితో 3 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేనాటికి వరల్డ్ వైడ్ 10 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 9 కోట్ల షేర్ వచ్చింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమా 18 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. సో.. ఫస్ట్ వీకెండ్ కే దాదాపు 60శాతం రికవరీ సాధించినట్టయింది. క్రిస్మస్ హాలిడేస్ కూడా యాడ్ అవ్వడం, మార్కెట్లో మరో సినిమా పోటీలో లేకపోవడంతో.. ఈ సినిమాకు మరిన్ని వసూళ్లు ఎక్స్ పెక్ట్ చేస్తోంది ట్రేడ్.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 3.80 కోట్లు
సీడెడ్ – రూ. 1.10 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.33 కోట్లు
ఈస్ట్ – రూ. 0.68 కోట్లు
వెస్ట్ – రూ. 0.52 కోట్లు
గుంటూరు – రూ. 0.66 కోట్లు
నెల్లూరు – రూ. 0.34 కోట్లు
కృష్ణా – రూ. 0.63 కోట్లు