ప్రతిరోజూ పండగ కోసం అమెరికా ప్రయాణం

Tuesday,October 15,2019 - 01:21 by Z_CLU

సాయి తేజ్ హీరోగా నటిస్తున్న “ప్రతిరోజు పండగే” షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ని అమెరికాలో షూట్ చేయబోతున్నారు. ఈరోజు సాయితేజ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో సాయి తేజ్, సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేశారు. ఇక దర్శకుడు మారుతి… హీరో సాయి తేజ్ ను కొత్త రకమైన క్యారెక్టరైజేషన్ తో, న్యూ లుక్ లో చూపించబోతున్నాడు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.

GA2, UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ సమర్పణలో, నిర్మాత‌ బ‌న్నీవాస్ సార‌ధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

నటీనటులు
సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం – మారుతి దాసరి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్, ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – జయ కుమార్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను