Prabhas - రేపే కొత్త సినిమా లాంచ్

Thursday,January 14,2021 - 12:41 by Z_CLU

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ ‘స‌లార్‌’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుండి ప్రేక్ష‌కాభిమానుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచేస్తుంది.

భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్న ‘స‌లార్‌’ చిత్రం జ‌న‌వ‌రి 15న ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఈ కార్య‌క్ర‌మానికి స‌లార్ చిత్ర‌యూనిట్ స‌హా క‌ర్ణాట‌క డిప్యూటీ చీఫ్ మినిష్ట‌ర్ అశ్వ‌త్ నారాయ‌ణ్ సీఎన్‌, ద‌ర్శ‌కధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ స‌హా ఇత‌ర సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్య‌క్ర‌మాలు ముగిసి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామా.. నా లుక్‌ను ఫ్యాన్స్‌కు, ప్రేక్ష‌కులకు ఎప్పుడు రిలీజ్ చేస్తామా అని చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది’’ అన్నారు.