క్వీన్ రీమేక్ దర్శకుడు మారాడు

Thursday,May 31,2018 - 12:04 by Z_CLU

కొన్ని రోజులుగా క్వీన్ రీమేక్ షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నుంచి దర్శకుడు నీలకంఠ తప్పుకున్నాడు. తమన్నకు, అతడికి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనేది టాక్. కారణం ఏదైతేనేం నీలకంఠ తప్పుకోవడంతో క్వీన్ రీమేక్ ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమా మళ్లీ పట్టాలపైకి వచ్చింది.

క్వీన్ రీమేక్ ను ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేయబోతున్నాడు. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. క్వీన్ మూవీ సెట్స్ పైనే రీసెంట్ గా ప్రశాంత్ వర్మ పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో తమన్నాతో పాటు మరో హీరోయిన్ పరుల్ యాదవ్ పాల్గొంది. గతంలో ‘అ!’ అనే డిఫరెంట్ మూవీ తీశాడు ప్రశాంత్.

కంగనా రనౌత్ హీరోయిన్ గా హిందీలో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాకు ఇది రీమేక్. తెలుగులో కూడా టైటిల్ ఇదే. ఒకేసారి సౌత్ లోని అన్ని భాషల్లో ఈ రీమేక్ తీస్తున్నారు. ఒక్కో లాంగ్వేజ్ లో ఒక్కో హీరోయిన్ నటిస్తోంది. తెలుగు వెర్షన్ కు తమన్న, తమిళ వెర్షన్ కు కాజల్, మలయాళ వెర్షన్ కు మంజిమా మోహన్, కన్నడ వెర్షన్ కు పరుల్ యాదవ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.