‘సాక్ష్యం’ సినిమాకి సీనియర్ యాక్టర్ వాయిస్ ఓవర్

Friday,July 20,2018 - 12:45 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ సినిమా. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 27 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ చెప్తున్నాడు.

ఫాంటసీ ఎలిమెంట్స్ హైలెట్ కానున్న ఈ సినిమాలో పంచభూతాలు గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కి ఎలా విట్నెస్ అవుతాయి అనేది ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అయితే ఆ నేచర్ కి ఉన్న పవర్స్ ని ఎస్టాబ్లిష్  చేసే సందర్భంలో ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్  ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

 

శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కంపోజర్. అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.