మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్

Sunday,August 20,2017 - 02:02 by Z_CLU

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ను మహానటి ప్రాజెక్టు కోసం తీసుకున్న విషయం తెలిసిందే. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కు ఎలాంటి రోల్ ఆఫర్ చేసి ఉంటారా అనే స్పెక్యులేషన్ మొన్నటివరకు నడిచింది. ఎట్టకేలకు ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ప్రముఖ రచయిత, నిర్మాత చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారు.

చక్రపాణి, సావిత్రి మధ్య విడదీయరాని బంధం ఉంది. సావిత్రిని తిరుగులేని నటిగా మార్చిన ప్రముఖుల్లో చక్రపాణి కూడా ఒకరు. అలాంటి కీలక పాత్ర కోసం ఇప్పుడు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. ఇంతకుముందు ప్రకాష్ రాజ్ పాత్రపై చాలా రూమర్లు వచ్చాయి. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్రకు దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేసింది యూనిట్.

సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తున్న ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ కోసం సమంతను కూడా తీసుకున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నాడు. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు.