ప్రగ్యాజైస్వాల్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్ వ్యూ

Tuesday,February 28,2017 - 12:32 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫాస్ట్ పేజ్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. మార్చి 3 న రిలీజ్ కి రెడీ అవుతున్న గుంటూరోడు  బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఈ ప్రిన్సెస్… ‘జీ సినిమాలు’ తో తన మనసులో మాటల్ని ఎక్స్ క్లూజివ్ గా షేర్ చేసుకుంది.

గుంటూరోడి గర్ల్ ఫ్రెండ్ డిఫెరెంట్ గా ఉండదు 

గుంటూరోడి గర్ల్ ఫ్రెండ్ అమృత. సో బబ్లీ.. అవుట్ స్పోకెన్.. రియలిస్టిక్ గా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎవరైనా సరే ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అయిపోతారు. అంత న్యాచురల్ గా ఉంటుందీ క్యారెక్టర్.

ఏ క్యారెక్టర్ తో నేను కనెక్ట్ అవ్వలేదు

నేను చేసిన కంచె హిస్టారికల్ మూవీ… సో ఆ టైం బ్యాక్ డ్రాప్ లో డిజైన్ అయిన క్యారెక్టర్ కాబట్టి.. నన్ను నేను చాలా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. బాడీ లాంగ్వేజ్ దగ్గర్నించి.. ఎక్స్ ప్రెషన్స్ ప్రతీది… ఒక రకంగా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ ని ఒక బాధ్యతగా తీసుకుని చేయాలి.. ఎలాంటి తప్పు జరగకూడదు అనే భయంతో చేయాలి.. నా రీసెంట్ మూవే ఓం నమో వెంకటేశాయ కూడా అంతే… ప్రెజెంట్ టైం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా కాదు… కానీ గుంటూరోడి గర్ల్ ఫ్రెండ్ అలా కాదు… చాలా న్యాచురాల్.. ఒకరకంగా నా క్యారెక్టరే ఆన్ స్క్రీన్ చేశానా అనిపిస్తుంది.

మనోజ్ స్వీట్ హార్ట్

మనోజ్ అందరితో ఒకేలా ఉంటాడు. అందరితో నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. షాట్ లో ఉన్నంత సేపే ఆ మూడ్ లో ఉంటాడు. ఒకసారి షాట్ ఓకె అయిపోయిందంటే సెకండ్స్ లో మూడ్ లోంచి బయటికి వచ్చేస్తాడు.. స్పాంటేనియస్ జోక్స్ పేలుస్తాడు… చాలా చాలా జోవియాల్ గా ఉంటాడు. అందుకే తనని అందరూ ఇష్టపడతారు. అందరి స్వీట్ హార్ట్ మనోజ్.

బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్

మనోజ్ కరియర్ లో చాలా మాస్ సినిమాలు చేశాడు కానీ గుంటూరోడు డెఫ్ఫినేట్ గా డిఫరెంట్ మూవీ. ఈ సినిమాలో చేసిన బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ మనోజ్ బహుశా ఇప్పటి వరకు చేయలేదు.

క్రెడిట్ మొత్తం డైరెక్టర్ దే

చాలా బ్యాలెన్స్డ్ డైరెక్టర్ S.K. సత్య. హై ఎండ్ ఇమోషనల్ సీన్స్ లోను, ఫన్ లోడెడ్ సీక్వెంసెస్ లోను ఎక్కడా ఎదే ఎక్కువ తక్కువా కాకుండా సినిమాకి ఎంత అవసరమో.. ప్రతి ఇమోషన్ ని అదే క్వాంటిటీ లో ప్రెజెంట్ చేశాడు. సినిమా ఇంత బాగా రావడానికి కంప్లీట్ క్రెడిట్ డైరెక్టర్ దే…

హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మ్యాగ్జిమం హైదరాబాద్ లోనే ఉంటున్నాను. హైదరాబాద్ ఇప్పుడు నాకు సెకండ్ హోమ్ అయిపోయింది.

బ్యాంకాక్ లో నక్షత్రం

నక్షత్రం షూటింగ్ ఇంకా కొంచెం షూటింగ్ బ్యాలన్స్ ఉంది. నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ లోనే…

చిన్నప్పుడే నేర్చుకున్నా

చిన్నప్పుడు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నక్షత్రం సినిమాకు పనికొచ్చాయి. కృష్ణవంశీ గారు సెట్స్ పై ఏ షాట్ ప్లాన్ చేస్తారో కనీసం గెస్ చేయలేం… నక్షత్రం సినిమాలో కాప్ క్యారెక్టర్ చేస్తున్నాను అని తెల్సినప్పుడు కూడా దాని గురించి కంప్లీట్ డీటేల్స్ తెలీదు.. కానీ చాలా సీరియస్, స్టైలిష్, యంగ్.. ఒకరకంగా చెప్పాలంటే కృష్ణవంశీ స్టైల్ కాప్. వెరీ ఇంటరెస్టింగ్ క్యారెక్టర్.

పార్టీ ఆన్ సెట్స్

గుంటూరోడు షూటింగ్ జరిగినన్ని రోజులు… పార్టీ ఆన్ సెట్స్ మూడ్ లోనే ఉన్నాం.. కాన్సెప్ట్ అలాంటిది.. ఐ థింక్.. అలా జోవియల్ ఉండటం వల్లే సినిమా అంత బాగా వచ్చింది.

అదే నా ఫేవరేట్ సాంగ్

అన్ని పాటలు చాలా ఇష్టం. కానీ డన్ డనక డన్ సాంగ్ సమ్ థింగ్ స్పెషల్…  అదే నా ఫేవరేట్.