మెగా హీరోయిన్ స్పీడ్

Wednesday,November 23,2016 - 09:10 by Z_CLU

క్రిష్ దర్శకత్వం లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన ప్రగ్య జైస్వాల్. ఈ సినిమాతో మెగా హీరోయిన్ గా గుర్తింపు అందుకొన్న ఈ భామ  వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ  అమ్మడు టాలీవుడ్ లో మూడు సినిమాలతో బిజీ హీరోయిన్ గా బిజీ బిజీగా ఉంది.
pragya-jaiswal-photos-in-saree-7
ఒక పక్క నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న భక్తి రస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో నాగార్జున సరసన కథానాయికగా నటిస్తున్న ప్రగ్యా… అటు కృష్ణవంశీ దర్శకత్వం లో రూపొందుతున్న ‘నక్షత్రం’ సినిమాలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరనస నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గుంటూరోడు’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ సినిమాలతో టాలీవుడ్ లో ఈ అమ్మడు  ఇంకెన్ని అవకాశాలు అందుకుంటుందో? చూడాలి.