'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' గా ప్రభుదేవా
Tuesday,March 03,2020 - 01:35 by Z_CLU
అటు దర్శకుడిగా ఇటు కొరియోగ్రాఫర్ గా అలాగే హీరోగా మల్టీటాలెంట్స్ తో దూసుకుపోతున్న ప్రభుదేవా తొలిసారిగా ఓ పోలీస్ గెటెప్ లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రభుదేవా హీరోగా నటించిన ‘పొన్ మానికవల్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో మార్చి 6న విడుదల చేస్తున్నారు.
ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను, పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్. సీతారామరాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభుదేవకు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
మాటలు: రాజేష్,
పాటలు: భువనచంద్ర,
సంగీతం: డి.ఇమ్మాన్,
నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు,
సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు,
నిర్మాత: ఆర్.సీతారామరాజు,
దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్