మరోసారి తెరపైకి అభినేత్రి

Thursday,August 23,2018 - 05:01 by Z_CLU

అటు తమన్నకు, ఇటు ప్రభుదేవాకు నటనపరంగా కలిసొచ్చిన చిత్రం అభినేత్రి. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో తమన్న యాక్టింగ్ అందరికీ ఎంతగానో నచ్చింది. అలా తెలుగు రాష్ట్రాల్లో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన అభినేత్రికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అవును.. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుదేవా వెల్లడించాడు.

ప్రస్తుతం ఈ హీరో లక్ష్మి అనే సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఆ ప్రమోషన్ లోనే అభినేత్రి సీక్వెల్ విషయాన్ని బయటపెట్టాడు. ఈ సీక్వెల్ లో నటించడానికి ఎప్పుడైనా రెడీగా ఉంటానని తమన్నా తనకు మాటిచ్చిందని, ప్రీ-ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వగానే ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తామని అంటున్నాడు ప్రభుదేవా

అభినేత్రి సినిమాలో తమన్న, ప్రభుదేవాతో పాటు సోనూసూద్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. మరి సీక్వెల్ లో సోనూసూద్ ఉంటాడా ఉండడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒరిజినల్ వెర్షన్ ను డైరక్ట్ చేసిన ఏఎల్ విజయ్.. సీక్వెల్ ను కూడా డైరక్ట్ చేయబోతున్నాడు.