మార్చి 23న గులేబకావళి రిలీజ్

Wednesday,March 14,2018 - 11:36 by Z_CLU

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇప్పుడీ సినిమాను సేమ్ టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి ఈ సినిమాను డబ్ చేశారు. ఈ నెల 23న తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది గులేబ కావళి.

గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పూర్తి ఎంటర్‌టైనింగ్ గా సాగే స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్స్, హన్సిక గ్లామర్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తాయని చెబుతున్నారు మేకర్స్.