Prabhudeva Chiranjeevi - మరోసారి కలుస్తున్నారా?

Friday,August 06,2021 - 03:52 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. నెక్స్ట్ ‘లూసిఫర్’ రిమేక్ చేయబోతున్నాడు. మోహన రాజా డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 13 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రీమేక్ కి సంబంధించి తక్కువ డేస్ లో షూట్ ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. ఆ తర్వాత బాబీ చిరు మరో సినిమా మొదలవుతుంది.

ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా మెహర్ రమేష్ తో చిరు ఇంకో సినిమా కూడా చేయనున్నారు. ఈ సినిమాలతో పాటు మెగా స్టార్ తాజాగా మరో సినిమా కూడా సెట్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. కొరియో గ్రాఫర్ కం డైరెక్టర్ ప్రభుదేవా డైరెక్షన్ లో చిరు ఓ సినిమా చేయనున్నాడని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కాంబో న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది.

గతంలో మెగా స్టార్ నటించిన ‘శంకర్ దాదా జిందా బాద్’ సినిమాను డైరెక్ట్ చేశాడు ప్రభుదేవా. ఆ సినిమా హిందీలో సంజయ్ దత్ నటించిన ‘లగే రహో మున్నా భాయ్’ కి రీమేక్. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈ కాంబోలో సినిమానా ? అసలు ఇందులో నిజమెంత ? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రస్తుతం కోలీవుడ్ , బాలీవుడ్ లో దర్శకుడిగా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న ప్రభుదేవా మెగా స్టార్ తో మరో మెగా ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నది నిజమేనా ? తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics