మిస్టర్ ప్రేమికుడిగా మారిన ప్రభుదేవా

Wednesday,April 03,2019 - 11:43 by Z_CLU

అప్పుడెప్పుడో మిస్టర్ రోమియో అనే సినిమా చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు మిస్టర్ ప్రేమికుడిగా మారాడు ఈ కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్. ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్క‌గ‌ల్రాని హీరో హీరోయిన్లుగా శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త‌మిళ చిత్రం `చార్లీ చాప్లిన్`. ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్ .వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు తెలుగులో కి `మిస్ట‌ర్ ప్రేమికుడు` పేరుతో అనువ‌దిస్తున్నారు.

ప్ర‌స్తుతం తెలుగు అనువాద కార్య‌క్ర‌మాలు ఫైన‌ల్ ద‌శ‌లో ఉన్నాయి. ఈ నెల‌లోనే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిల‌ుస్తాయంటున్నారు మేకర్స్.

సంగీతంః అమ్రీష్‌
స్టంట్స్ః క‌న‌ల్ క‌న్న‌న్
సినిమాటోగ్రాఫ‌ర్ః సౌంద‌ర్ రాజ‌న్‌
స‌మ‌ర్ప‌ణః ఎమ్‌.వి.కృష్ణ‌
కో-ప్రొడ్యూస‌ర్స్ః మ‌హేష్ చౌద‌రి గుర్రం, శంక‌ర‌రావు సారికి
నిర్మాతః వి.శ్రీనివాస‌రావు
ద‌ర్శ‌క‌త్వంః శ‌క్తి చిదంబ‌రం